హైదరాబాద్ లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ మేఘనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తలదాచుకున్న మేఘనతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఫెర్టిలిటీ సెంటర్లో మహిళల అండాల సేకరణ వ్యవహారంలో మేఘన కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒయాసిస్ చైర్మన్ సూర్యకిరణ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.