దట్టమైన పొగమంచు కారణంగా.. ఒకే ప్రదేశంలో అటు, ఇటు ఉన్న రహదారులపై కలిపి 86 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో వాహనదారులు గాయపడ్డారు. బల్గేరియాలో ఈ దుర్ఘటన ఒకే ప్రదేశంలో అటు, ఇటు ఉన్న రోడ్లపై దాదాపు 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో చాలావరకు ట్రక్కులే ఉన్నాయి. ఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మంత్రి కాట్యా ఇవ్కోవా వెల్లడించారు.