బిష్ణుపూర్ ఘరానా సితార్ విద్వాంసుడు పండిట్ మణిలాల్ నాగ్ అనారోగ్య సమస్యల కారణంగా కోల్‌కతాలో కన్నుమూశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో శకం ముగిసిందని, నాగ్ బిష్ణుపూర్ ఘరానా సంప్రదాయాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు. 87 ఏళ్ల మణిలాల్ నాగ్ కు 2020లో పద్మశ్రీ, 2001లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించాయి. బిష్ణుపూర్ ఘరానాకు చెందిన తొలి సంగీత విద్వాంసుడిగా ఈ పురస్కారం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2012లో ఆలావుద్దీన్ పురస్కారం, 2015లో బంగా విభూషణ్‌తో సత్కరించింది.