హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ.. దానికి ముందు భాగంలో ల్యాప్‌టాప్‌ను అమర్చుకుని, రోడ్డుపై వెళ్తూనే ఆఫీస్ పనులు, కోడింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే… ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు అని సీపీ సజ్జనార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

