మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడా ప్రపంచంలో సుచికా తారియాల్ ఒక నయా అధ్యాయాన్ని లిఖించింది. ఏషియన్ గేమ్స్‌లో ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచికా తలపడింది. చివరి వరకు ఆధిపత్యం కోసం పోరాడినప్పటికీ, అత్యల్ప పాయింట్ల తేడాతో సుచిక ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, అంతకుముందే కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతో భారత్ ఖాతాలో చారిత్రక పతకం చేరింది.