ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే, మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు బొత్స మధు దాడికి ట్రై చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో కొందరి పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు పన్నుతూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.