పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు.