తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో తీవ్ర అలజడి సృష్టించిన పెద్దపులి, తన దిశను మార్చుకుని తెలంగాణలోకి ప్రవేశించింది. ఏపీలోని తెల్లపల్లి అడవుల మీదుగా గురువారం ఉదయం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి బీట్ పరిధిలోని బచ్చువారిగూడెం సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో టెలీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా ఈ కదలికలను నిర్ధారించారు.