ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని విడుదల చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 తుదిగడువు. ఈనెల 26న పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రీపోలింగ్ అవసరమైతే ఈనెల 27న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

