జెన్ అల్ఫా విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. బురదమయమైన రోడ్డు దుస్థితిపై ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన కాన్వాయ్‌ను వెళ్లనిచ్చారు. హనుమన్‌గంజ్ ప్రాంతంలోని పలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు స్థానిక కాలువ రోడ్డును విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. అయితే నీరు నిలువడంతో ఆ రోడ్డు బురదమయంగా మారింది. దీంతో నడిచి వెళ్లే విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు తరచుగా జారి బురద నీటిలో పడుతున్నారు.