రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో కొత్తగా తీసుకొచ్చిన ‘స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్’ (శక్తి) స్కీమ్ పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు తమ నిరసన తీవ్రతరం చేశారు. వరుసగా మూడోరోజు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మమ్మల్ని ఈసెట్ రాసి బీటెక్కు వెళ్లకుండా చేస్తే మా భవిష్యత్ ఏం కావాలని నిలదీశారు. శక్తి స్కీమ్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జీవో 97ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.