హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుండలి-మనేసర్-పల్వాల్ కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయిదుగురు పోలీసులు మృతిచెందారు. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా సమీపంలో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో.. అదుపు తప్పి ముందున్న వాహనాన్ని స్కార్పియో ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఎస్యూవీ నుజ్జునుజ్జు అయ్యింది.

