పశ్చిమ బెంగాల్లో మే 9వ తేదీన బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అగ్రకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నిర్వహించే ‘పొచిశే బోయ్ షోక్’ వేడుకల రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. బెంగాలీ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే కొత్త పాలనను ప్రారంభించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. సువేందు అధికారి పేరు ముఖ్యమంత్రి పదవికి బలంగా వినిపిస్తోంది.

