రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దుష్యంత్ గౌతమ్ను సిక్కిం గవర్నర్గా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022లో జరిగిన అంకితా భండారి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు సిక్కిం గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియామకాన్ని నిలిపివేసి, ఆయన పదవీ స్వీకారాన్ని వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా, ఇందులో ప్రమేయం ఉన్న VIP ఎవరనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదని ఆరోపించారు.