పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలోని ఒక మసీదు ప్రాంగణంలో తీవ్ర అసభ్యకర పనులకు పాల్పడ్డారన్న నేరానికి బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు పౌరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. మరణశిక్ష పడిన వారిని నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితీ అక్తర్లుగా గుర్తించారు. వారు దేశంలో నివసిస్తున్న సమయంలో మసీదు పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని సెక్యూరిటీ దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో వారి నేరం రుజువు కావడంతో ఇస్లామిక్ చట్టం ప్రకారం ‘తాజీర్’ (విచక్షణారహిత శిక్ష) కింద ఇద్దరికీ ఉరిశిక్ష విధించింది.