స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC) ఇవాళ సాధారణ పరిశీలకులకు నియమించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారితో భేటీ అయిన ఎస్ఈసీ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.