అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చరై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె ఆర్టీసీ డిపోనకు చెందిన నాన్ స్టాప్ బస్సు మంగళవారం ఉదయం తిరుపతికి బయల్దేరింది. వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో మదనపల్లె-తిరుపతి హైవేపై ప్రయాణిస్తుండగా టైరు పంక్చర్ కావడంతో పక్కనే ఉన్న కల్వర్టులోకి వెళ్లి బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.