రాయలసీమ ఉద్యానహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)లో రిలయన్స్ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్యాన హబ్, ఐఏఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి రిలయన్స్ పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ఏకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని.. రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై మార్గనిర్దేశం చేయాలని సీఎం చంద్రబాబును అనంత్ అంబానీ కోరారు.