పిల్లల్ని కనేందుకు అమెరికా వచ్చే వారిపై ట్రంప్ యంతాంగ్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ‘బర్త్ టూరిజం’పై ఉక్కుపాదం మోపుతోంది. కేవలం గత నెల రోజుల్లోనే వివిధ దేశాల నుంచి తొమ్మిదో నెల గర్భంతో అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి వీటిని రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు. కొన్ని ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లు కోచింగ్ ఇస్తూ, ట్రావెల్, వసతి సౌకర్యాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్టు తెలుస్తోందన్నారు.