ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ సమయంలో జైలు లోపల తనను అవమానించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కావాలనే జైలు గ్రిల్స్ వెనుక నిలబెట్టి, జైలు సిబ్బందితో ఫొటోలు తీయించారని. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తే, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నామని సమాధానం ఇచ్చినట్టు జగన్ చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.చంద్రబాబు తప్పుడు విత్తనాలే రేపు విషవక్షాలపై ఆయన్ని చుట్టుముడతాయని జగన్ హెచ్చరించారు.