వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణపై చేతబడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అఘోరాలతో పూజలు చేస్తున్నారని.. పదేళ్లు పాలించిన వ్యక్తులు ఇలాగేనా చేసేది.. అని ప్రశ్నించారు. తన వైపే దేవుడు ఉన్నాడని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పమే తనను కాపాడుతుంటుందన్నారు. చేతబడి తిరగబడితే అష్ట దిగ్బంధనం చేస్తుందన్నారు. ఇప్పటికే ఫాంహౌస్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నారని కేసీఆర్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.