అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ప్రమాదంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
దిలీప్ కుమార్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

