అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గ్రాండ్ హేవెన్ టౌన్‌షిప్‌లోని ఒక నివాసంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆర్నెళ్ల చిన్న పిల్లల నుంచి 15 ఏళ్ల వయస్సు గల ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 8 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో కొందరి శరీరాలపై తుపాకీ గుళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఈ ప్రమాదం వెనుక హత్య, ఆత్మహత్య కోణం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.