ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అమెరికా వద్ద సంప్రదాయ సైనిక ఎంపికలన్నీ అయిపోయాయని, ఇప్పుడు వారి వద్ద కేవలం ‘అణుబాంబు’ దాడి ఆప్షన్ మాత్రమే మిగిలి ఉందని టెహ్రాన్ డిప్యూటీ మేయర్ హమీద్రేజా ఘోలామ్‌జాదేహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ పీఆర్, అంతర్జాతీయ సంబంధాల కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఘోలామ్‌జాదేహ్.. తమ దేశంపై మళ్లీ దాడి జరిగినా శత్రువులపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ విషయం మాకూ తెలుసు, అమెరికాకూ తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.

