దేశ వ్యూహాత్మక రక్షణ సన్నద్ధతను మరింత బలోపేతం చేస్తూ DRDO శనివారం ఒకేసారి పలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించింది. ఆకాశమార్గం, సముద్ర మార్గాల ద్వారా దేశానికి పొంచి ఉన్న అనేక రకాల క్షిపణి ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ పరీక్షల ద్వారా భారత్ నిరూపించుకుంది. మల్టీ-లేయర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థ సుదూర ప్రాంతాల నుండి దూసుకొచ్చే శత్రువుల లాంగ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాలను గాల్లోనే విజయవంతంగా అడ్డుకుని, వాటిని ముక్కలు ముక్కలు చేసింది.

