ఇండియా, అమెరికా, బ్రిటన్, వియత్నాం, ఫిలిప్పీన్స్… ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇండియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని నోమురా హోల్డింగ్స్ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనివిధంగా, ఇండియాలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి కంటే.. ఏఐ కోసమే కొత్తగా ఉద్యోగాల్లోకి
తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని నోమురా హోల్డింగ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.