హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా – బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు కండక్టర్ కూడా మరణించారని పేర్కొన్నారు. ఈ బస్సు ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియలేదని అన్నారు.