శ్వేత పత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 98 శాతం ఉద్యోగులకే వెళ్తుందని పేర్కొనడంపై ఏపీ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం ఖర్చులో ఉద్యోగుల జీతాల వాటా 37 శాతమే ఉందన్నారు.మరి ఉద్యోగుల ఖర్చు 98 శాతంగా ఎలా చూపించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రూపాయి బిల్లు పెట్టినా చెల్లింపులు జరుగుతున్నాయని, తమకు రావాల్సిన పీఆర్సీ, డీఏల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు.