ఐపిఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్యంసం సృష్టించాడు. తొలి ఓవర్ నుంచే భారీ సిక్సులతో హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సూర్యవంశీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు నమోదు చేసింది.

