హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానల్స్ పై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదు అయింది. మైనర్లను ఉపయోగించి లైక్లు ,
వ్యూస్ సాధించే ప్రయత్నాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కంటెంట్ చూసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ చేయాలి లేదా 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.

