గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో వడగండ్ల వాన, ఈదురుగాలులు బీభత్సవాన్ని సృష్టిస్తున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల కల్లాల్లో తడిసిన ధాన్యంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

