భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. భారత్‌పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయని అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తరువాత ఆయన మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడిన ట్రంప్, రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తుందని అన్నారు. అంతేకాదు అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని వెల్లడించారు.

