ప్రముఖ వ్యాపారవేత్త, దివీస్ ల్యాబ్స్ యజమాని డాక్టర్ మురళికృష్ణ ప్రసాద్ కుటుంబంలో పెళ్లి పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. దివీస్ యజమాని కుమారుడు, ఆర్‌టిఐ కమిషనర్ కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇరుకుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వరకట్నం కింద ఇచ్చిన రూ. 5కోట్లు తిరిగి ఇవ్వాలని కోరినా వరుడి తరఫున వారు స్పందించకపోవడంతో పెళ్లి కుమార్తె తల్లి విజయ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

