టీడీపీ కార్యవర్గ సమావేశంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా కుట్రలు, వెన్నుపోట్లతోనే నిండి ఉందని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, చంద్రబాబుకు “మెగలోమానియా” (తనను తాను గొప్పగా ఊహించుకునే వ్యాధి) ఉందని భూమన ఎద్దేవా చేశారు.
మీడియాలోని కొన్ని వర్గాలు చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

