ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్
అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు.

