సెంట్రల్ సూడాన్‌లో శనివారం నిర్వాసిత కుటుంబాలతో వెళ్తున్న వాహనంపై పారామిలిటరీ గ్రూపు డ్రోన్ దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని డాక్టర్ల గ్రూపు వెల్లడించింది.
నార్త్ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో రహాద్ సిటీ సమీపాన రాపిడ్ సపోర్టు ఫోర్స్స్ ఈ దాడికి పాల్పడ్డాయి. నార్త్ కొర్డోఫాన్ లోని డుబెయికర్ ఏరియా యుద్ధ ప్రాంతం నుంచి తరలిపోతున్న నిర్వాసితులపై ఈ దాడి జరిగిందని డాక్టర్ల గ్రూపు పేర్కొంది.

