సోమవారం సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు, ప్రముఖ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్‌తో భేటీ అయ్యారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ విధానాన్ని వివరించారు. హైపర్‌ఫార్మెన్స్ సిస్టంను అమలు చేసి, 12 ఏళ్ల వయసు నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

