జపాన్ సముద్రగర్భంలో లభించిన అరుదైన భూమితో కూడిన మట్టి ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చే దశకు చేరింది జపాన్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి సుమారు ఆరు కిలోమీటర్ల లోతులో ఉన్న అరుదైన భూమి సంపన్న మట్టిని విజయవంతంగా వెలికితీసింది. ఈ పని కోసం ‘చిక్యు’ పేరుతో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధన నౌకను ఉపయోగించారు. జనవరి 12న టోక్యోకు ఆగ్నేయంగా దాదాపు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం దిశగా ఈ నౌక ప్రయాణం ప్రారంభించింది.

