ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటకాన్ని పెంచడానికి త్వరలో ఒక భారీ క్యాంపెయినింగ్ ప్రారంభించబోతోంది. ఈ ప్రచారంలో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ‘కమ్ అండ్ సే G’డే’ ఆస్ట్రేలియా టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలలో జరగనుంది. క్యాంపెయిన్ కోసం సుమారు రూ.1137 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ప్రతి దేశం నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని ఈ క్యాంపెయిన్‌లో భాగం చేశారు.

