షార్జా నుండి చెన్నై చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున విమానం ల్యాండ్ అయి రన్‌వే నుంచి పార్కింగ్ ఏరియాకు కదులుతున్న సమయంలో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు. CISF సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణంలో రెండు సార్లు వాంతులు చేసుకున్న అతడు, విమానం ఆగిన వెంటనే బయటపడటానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు

