loader

దారుణం.. జ‌ర్నలిస్టుతో కాళ్లు ప‌ట్టించుకున్న కాలేజీ యాజ‌మాన్యం

ఏపీలో జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన విషయం మరువకముందే తాజాగా అనంతపురంలో గీతం జూనియర్ కళాశాల అక్రమాలను వెలుగులోకి తెచ్చారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై ఆ సంస్థ యాజమాన్యం పైశాచికంగా ప్రవర్తించింది. ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా కన్న కొడుకు కళ్లముందే బలవంతంగా తమ కాళ్లు మొక్కించుకున్నారు. అక్కడితో ఆగకుండా క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ […]

ఇక గూగుల్ డ్రైవ్‌తో పనిలేదు..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం ఒక భారీ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు చాట్ బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ పై ఆధారపడాల్సి వచ్చేది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతి యూజర్‌కు సుమారు 2జీబీ (2GB) వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీని వాట్సప్ అందించనుంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉండేవారి కోసం 50GB స్టోరేజీ పెయిడ్ వెర్షన్ ఏర్పాట్లు చేస్తోంది.

లోకేశ్ రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారింది: రజిని

మంత్రి లోకేశ్ రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారిందని మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌కు మాజీ మంత్రి విడదల రజిని చేరుకొని పాస్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. 2500 మంది వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, దాదాపు 800 మందిపై హత్యాయత్నం జరిగిందని, 390 మందిని హత్య చేశారని రజని మండిపడ్డారు. 700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్..తమిళనాడుపై భారీగా పందాలు

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్లు జోరందుకున్నాయి. బెట్టింగ్ రాయుళ్ళు భారీగా పందాలు కాస్తున్నారు. కొందరు తమ అభిమాన పార్టీల మీద పందాలు కాస్తుంటే మరికొందరు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆధారంగా చేసుకుని బెట్టింగ్ కు సిద్ధమయ్యారు. వాట్సాప్ , టెలిగ్రామ్ వంటి వాటిలో గ్రూపులు క్రియేట్ చేసి పందాలు నిర్వహిస్తున్నారు. మిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని పందాలు జోరుగా సాగుతున్నాయి. విజయ్ పార్టీపై ఒకటికి మూడు రెట్లు మొత్తం ఆఫర్ చేస్తున్నారు.

జబల్‌పూర్ క్రూయిజ్ ప్రమాదం..11కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో చోటుచేసుకున్న క్రూయిజ్ బోటు ప్రమాదం గాలింపు చర్యల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడంతో.. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. బోటు బోల్తా పడిన సమయంలో ప్రాథమికంగా 9 మృతదేహాలను వెలికి తీశారు. శనివారం నీటి అడుగున చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారుల శవాలు లభ్యం అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 28 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు.

కాకినాడలో భారీ వర్షం.. రహదారులు జలమయం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాకినాడలో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వార్త

పవనన్నా కాపాడండి.. మస్కట్‌లో తెలుగు మహిళ ఆవేదన

ఒమన్ మస్కట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమై విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తాను పని కోసం మస్కట్ వెళ్లగా అక్కడ యజమాని తనను నిత్యం తీవ్రంగా వేధిస్తున్నాడని.. గదిలో బంధించి కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నాడని ‘పవనన్నా.. దయచేసి నన్ను కాపాడండి.. నన్ను చంపేస్తారన్నా’ అంటూ ఆ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కన్నీటితో వేడుకుంది. ఈ వీడియో సోషల్ […]

11 రోజుల పోరాటం తర్వాత నియంత్రణలోకి.. 1,600 హెక్టార్ల అడవి దగ్ధం!

ఉత్తర జపాన్‌లోని ఇవాటే పర్వత ప్రాంతంలో గత 11 రోజులుగా మండుతున్న భారీ కార్చిచ్చు ఎట్టకేలకు నియంత్రణలోకి వచ్చింది. గత 30 ఏళ్లలో జపాన్‌లో సంభవించిన రెండో అతిపెద్ద అగ్నిప్రమాదంగా దీనిని పేర్కొంటున్నారు. ఈ మంటలను ఆర్పేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు 1,000 మందికి పైగా సైనికులు శ్రమించారు. సుమారు 1,600 హెక్టార్ల (4,000 ఎకరాలు) అటవీ ప్రాంతం ఈ అగ్నికి ఆహుతైంది. ఈ విస్తీర్ణం న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ పార్క్ కంటే ఐదు […]

మహబూబ్‌నగర్‌లో లవర్ ముందే బాలికపై గ్యాంగ్ రేప్

ఓ యువకుడు, బాలిక(17)ను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రేమ జంటను కూలీ పనులు చేస్తున్న అశోక్ కుమార్(26), లక్ష్మణ్(25) గమనించి వారిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని స్నేహితుడి ద్వారా రూ. 6500 ఫోన్ పే చేయించుకున్నారు. యువకుడి ముందే బాలికపై లక్ష్మణ్, అశోక్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్టు కింద ఇద్దరు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON