మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో చోటుచేసుకున్న క్రూయిజ్ బోటు ప్రమాదం గాలింపు చర్యల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడంతో.. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. బోటు బోల్తా పడిన సమయంలో ప్రాథమికంగా 9 మృతదేహాలను వెలికి తీశారు. శనివారం నీటి అడుగున చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారుల శవాలు లభ్యం అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 28 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు.

