ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (ప్రపంచ పత్రికా దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.

