కొందరు నరేంద్ర మోదీ అభిమానుల ప్రభు భక్తి ఇప్పుడు విద్యా సంస్థలకు కూడా పాకడంతో ఆయన తత్వమే ఇప్పుడు యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికగా మారింది. దేశభక్తి సమాజ శాస్త్రం’ అనే కొత్త కోర్సులో మోదీ తత్వంతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్, సయాజీరావు గైక్వాడ్-3 వంటి సంఘ సంస్కర్తల కృషిని శాస్త్రీయంగా విశ్లేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ విశ్వవిద్యాలయ సమాజ శాస్త్ర విభాగ అధిపతి వీరేంద్ర సింగ్ తెలిపారు.

