ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో సీఐడీ సిట్ దూకుడు చూపిస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. 12వ తేదీ ఉదయం విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో ఆదేశించింది. విజయసాయిరెడ్డిని లిక్కర్ కేసులో గతంలోనూ ఓ సారి సిట్ ప్రశ్నించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలంగా ఉన్నట్లుగా గుర్తించారు. అందుకే మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లుగా తెలుస్తోంది.

