జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (మల్లన్న) ఉదయం పంట పొలానికి వెళ్లాడు. పొలంగా పనిచేసుకుంటున్న సమయంలో మల్లికార్జున్‌కు వడ దెబ్బ తగిలి మృతి చెందాడు. తన కొడుకు మరణ వార్తను విన్న మల్లికార్జున్ తల్లి కురువ రంగమ్మ మనోవేదనతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఓ వైపు కొడుకు.. మరోవైపు ఇక కొడుకు లేడన్న బెంగతో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

