ఐబీఎం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. “సింగిల్ డిజిట్ 1%” ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అంటే కనీసం 2,700 మందికి ఉద్యోగ భయం తప్పదన్న మాట. ఈ నిర్ణయం కృత్రిమ మేధస్సు ప్రాజెక్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్లు, మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై సంస్థ దృష్టి పెరగడం వల్లనే తీసుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

