నిన్నమొన్నటి దాకా రెహ్మాన్‌ని లెజెండ్‌లా అభిమానించి, ఆరాధించినవాళ్లే.. ఇప్పుడు ఆయన్ని తిడుతూ ట్రోల్ చేస్తున్నారు. ‘1989లో వచ్చిన యానీ స్వరపరిచిన ‘క్వైట్ మ్యాన్’ ట్యూన్, ‘రోజా’లోని సాంగ్ ట్యూన్ ఒకేలా ఉంటాయంటూ సాక్ష్యాలతో వినిపిస్తున్నారు.. ‘పొన్నియన్ సెల్వం’ మూవీలో ‘వీర రాజ వీర శూర’ సాంగ్ ట్యూన్ కూడా గుండెచా బ్రదర్స్ ఆలపించే ‘శివ సుత్తి’ మక్కీకి మక్కీ కాపీ చేశాడని ‘మా తుజే సలాం’ పాట,‘ముక్కాలా ముక్కాలా’ పాట కాపీ చేసిన ట్యూన్స్‌ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి, ఆయన పరువు తీస్తున్నారు

