2026 సంవత్సరానికి గాను మొదటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ-నెట్) పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలను జూన్ 22 నుంచి జూన్ 30 వరకు మొత్తం 85 సబ్జెక్టుల్లో అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు ఎన్టీఏ తమ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి, పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు మాత్రమే తుది గడువు ఉంటుంది.

