కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే యువ గొంతులను అణిచివేసే ప్రమాదకర ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి తీవ్రంగా విమర్శించారు. “నేటి భారతదేశంలో ప్రశ్నించడం నేరంగా మారుతోంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం కప్పి ఉంచబడుతున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల యువ కార్యకర్త అశ్వమిత్ గౌతమ్పై కొనసాగుతున్న వేధింపులను ఖండించిన డా. రేఖ.. ఆ యువకుడు ఎవరిని దుర్భాషలాడలేదని, హింసకు పాల్పడేలా రెచ్చగొట్టలేదని తెలిపారు.

